Posts

Showing posts from December, 2024

విశ్వజనీన ప్రేమతత్వం

Image
కృష్ణ భగవానుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అపారమైన ప్రేమ, భక్తి, సహనం వంటి విషయాలను గురించి భగవద్గీతలో కృష్ణుడు ప్రధానంగా వివరించాడు. ప్రేమతో జీవించడం అనేది జీవితంలో సత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అనుభవాలను,శాంతిని ఆనందాన్ని నేర్పుతుందని ఆయన తెలిపారు.ప్రేమకు సహనం అనేది ముఖ్యం.నిజమైన ప్రేమ అనేది ఎటువంటి అంచనాలు లేకుండా, ఎటువంటి కారణాలు లేకుండా, ప్రయోజనం కోరకుండా ఉండాలని కృష్ణుడు తెలిపాడు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి స్వార్థం, ఆశ లేకుండా ఉండటం, వారి మనోభావాలను గౌరవం ఇవ్వడం బంధాల్లో ప్రేమను పెంచేందుకు సహాయడతాయి. ఒకరి పట్ల మరొకరు జాగ్రత్తగా వ్యవహరించడమే నిజమైన ప్రేమ అని మన సనాతన ధర్మం చెబుతోంది.పరమాత్మను మీ సొంతం చేసుకోవాలంటే, కేవలం ప్రేమతోనే అది సాధ్యం. ప్రేమతో ఉంటే నేను సంతోషంగా మీ పరం అవుతాను. ప్రేమ అనేది జీవన శక్తి, ఇది ప్రపంచాన్ని నడిపించే శక్తి.నిజమైన హితుడు, స్నేహితుడు భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని చెప్పే దే కుచేలుని చరిత్ర. ప్రకృతి పురుషుల కలయికను తెలిపే తత్త్వబోధనే రుక్మి ణీ కళ్యాణం. రుక్మిణి జీవాత్మ. శ్రీకృష్ణుడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ను చేరాలనే తపనే రుక్మిణీ కళ్యాణం.మనిషి ...

కర్మ సిద్ధాంతం

“నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతేహ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణైః ” — గీత 3అ.5శ్లో. భావం:సృష్టిలోని ప్రతిప్రాణీ ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేసే కర్మలే మనకు ఉపయోగపడతాయి. ఎవరికైనా అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ వారికి కూడా కలుగుతుంది. వేద భూమి కావడంతో మనం అన్యాయాలను, అక్రమాలను సహించం. అవినీతి, బంధుప్రీతిని ఉపేక్షించం. మన కర్మలే మనకు జీవితంలో ఎదిగేందుకు సాయపడతాయి. కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరికల ఉధృతిని తగ్గించుకొనుట, అనిత్యమైన భోగ భ...

ధనుర్మాసం విశిష్టత

Image
శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా: సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున 12 నెలలు 12 రాశులలో సంచరిస్తాడు. ఆ విధంగా సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము అని పిలుస్తారు. ధనుర్మాసము దక్షిణాయణంలో చివరి మాసము. ఈ నెల 16న ప్రారంభమయ్యే ధనుర్మాసము జనవరి 13న ముగుస్తుంది. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది.భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది “ధనుర్మాసము”. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ, అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది.ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి.ధనుస్సంక్రమణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం అని మన శాస్త్రాలు తెలియజెస్తున్నాయి.ఈ ధనుర్మాసంల...

హృదయ శుద్ధి

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ! మూఢనమ్మకాల చట్రంలో బ్రతుకుతూ అదే ఆధ్యాత్మికత అని భ్రమలో కొట్టుమిట్టాడే మానవులకు వేమన పరోక్షంగా ఈ పద్యం ద్వారా చురకలు అంటించాడు. కర్మలు చేయడం మానవుల ప్రధాన కర్తవ్యం అయితే ఆ కర్మలకు మంచి సానుకూల ఫలితాలు రావాలంటే పవిత్రమైన మనసు ఎంతో అవసరం అన్నది వేమన ప్రబోధం. మన మనసు నిర్మలంగా లేనపుడు ఎన్ని ఆచారాలు పాటించి మాత్రం ఏం ప్రయోజనం  ?  మనసంతా కోరికలు, అశాంతి, అసూయ, ఈర్ష్య వంటి వ్యతిరేక ఆలోచనలు నింపుకొని పైకి ఆడంబరమైన పూజలు, స్తోత్రాలు వంటి ఆచార వ్యవహార కాండ చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఒనగూడదు. అన్నింటికీ నిర్మలమైన మనసే ప్రధానం. అందుకే మనస్సును పవిత్రం గా ఉంచుకోవడానికి పురుష ప్రయత్నం చేయాలి. అంతే నేటి కంప్యూటర్ భాషలో చెప్పాలంటే సాఫ్ట్ వేర్ ఎలాంటి వైరస్ లేకుండా వుండాలి. అప్పుడే కంప్యూటర్ ఎలాంటి సమస్యలు లేకుండా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనికి ఉదాహరణగా శుచి, శుభ్రత లేని పాత్రలలో వంట చేస్తే అది పాడైపోయి తినేవారికి అనారోగ్యం కలిగిస్తుంది. వంట చేసేటప్పుడు మానసిక పవిత్రతతో పాటు శారీరక పవిత్...

గొప్ప ఫలితాలకు మనస్సే ప్రధానం

Image
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు గొదవుగాదు విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ! వినురవేమ! 16 వ శతాబ్దంలో మన తెలుగునాట వెలసిన శ్రీ వేమన గొప్ప సంఘ సంస్కర్త. నాడే ఈ సమాజంలో నెలకొన్న దురాచారాలను , మూఢ నమ్మకాలను ఖండించి, మానవుల సత్ప్రవర్తన ఎలా వుండాలో తన పద్యాల ద్వారా సులభశైలిలో వివరించి ఈ మానవాళికి మహోపకారం చేసారు. పై పద్యానికి అర్ధం మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నది కదా అని.. ఈ కలియుగంలో మానవులు కలి ప్రభావానికి లోనై ఘోరమైన పాపాలు చేస్తుంటారని కలియుగం ఆరంభం ముందే బ్రహ్మదేవుడు హెచ్చరించాడు. అందులో ముఖ్యమైనది మానవుల మనసు వేగంగా పరిగెత్తే గుర్రాలలా వారి ఆధీనంలో నియంత్రణలో వుండ దని. అందుకే మనస్సును జయించడం, దానిని ఆధీనం లోకి తెచ్చుకోవడం ఎంతో అవసరం. ఈ పద్యం ద్వారా మనసు యొక్క ప్రాముఖ్యాన్ని వేమన తెలియజేసారు. దానధర్మాలు చేయడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, అతిథి అభ్యాగతులు ఆదరించడం,పేదసాదలకు సహాయం చెయ్యడం చివరకు ఇంట్లో వ్రతాలు, పూజాది సంస్కారాల సమయంలో మనసును పవిత్రం చేసుకోవడం, నిజమైన ప్రేమ, దయ కరుణ లాంటి మంచి గుణా...

భస్మధారణ

Image
సోమవారం భస్మధారణ తప్పనిసరి. విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ వుంటాడు. నరకబాధలు లోనుకాకుండా చూస్తాడు. భస్మాన్ని ధరించడం ద్వారా శరీరంలోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది. భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని స్తుతించాలని  ఉపనిషత్తులు చెప్తున్నాయి. మన శాస్త్రాల ప్రకారం స్వల్పభస్మధారణ, మహాభస్మధారణ అనే రెండు రకాలైన పద్ధతులున్నాయి. ఈ పద్ధతులలో ముప్ఫయి రెండు స్థానాలలో గానీ, పదహారు చోట్లకానీ భస్మధారణ చేయాలి. లేదా కనీసం అయిదు తావులందైనా భస్మమును ధరించాలి. ఇవి ఏవీ కుదరనప్పుడు త్రిపుండ్రాలనైనా ధరించాలి. దీనిని సద్యోజాతాది పంచమంత్రాల పూర్వకంగా ధరించడం మరింత విశేషం. ఆయా మంత్రాలు తెలియని వారు కనీసం ‘ఓం నమ: శివాయ’ అని స్మరిస్తూనైనా భస్మధారణ చేయాలి. ఆవుపేడతో చేసిన భస్మము అత్యంత శ్రేష్ఠమైనది. త్రివేణి స్నాన ఫలం సంప్రాప్తమౌతుంది. భస్మధారణ చేయడం వల్ల అనేక రకాల పాపాలు నశించి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భస్మానికి ‘విభూతి’ అని కూ డా పేరుంది. విభూది- అంటే ఐశ్వర్యం. అగ్ని కూ డా ఐశ్వర్యక...

మానవత్వం- మానవతా విలువలు

Image
 మానవత్వం  సాటి మానవుడికి తన శక్తి  కొలది ఎంతో కొంత మేలు చేయ‌డం అన్న‌ది మ‌నిషి నానాటికి మ‌రిచిపోతున్న రోజులివి. మాన‌వీయ విలువ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని స‌మాజం త‌యార‌వుతోంది అన్నది వాస్తవం. నాగ‌రికత వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాం.. సాశ్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయమైన ప్ర‌గ‌తి సాధించాం అని చెప్పుకుంటున్న మ‌నిషి... మ‌నిషిగా ఉండ‌టం మాత్రం మరిచిపోతున్నాడ‌ని సామాజిక శాస్త్ర‌వేత్త‌లు, విశ్లేష‌కులు పేర్కొంటు న్నారు.  మాజం అభివృద్ధి చెందాలంటే నైతిక, నాగరిక, దాతృత్వ, మానవీయ విలువలు అత్యంత ముఖ్యం. నేటి విద్యా విధానంలో సైన్సు, లెక్కలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వీటిని విస్మరంచడం ఎంతమాత్రం మంచిది కాదు. మానవత్వం వుంటే నైతిక విలువలు వాటంతట అవే వస్తాయి. కాబట్టి కావాల్సింది మానవత్వం. మానవత్వం వుంటే నైతిక విలువలు గురించి విడిగా ఆలోచించనక్కరలేదు. డు ఎక్కువమంది నైతిక విలువలు వున్నట్లు నటిస్తున్నారు. వారిలో మానవత్వం మచ్చుకైనా కవిపించదు. మనుషుల్లో మానవత్వం పెరిగితే లోకం ఆనందంగా శాంతి సౌభాగ్యాలతో వర్ద్ధిల్లుతుంది.  శ్రీ సత్యసాయిబాబా ఒక సందర్భంలో మానవత్వం గురించి అధ్హ్భుతమైన దివ్య...

భక్తులను సదా రక్షించే శ్రీ సాయి

Image
పూనా జిల్లా, జున్నూరు తాలూకా నారాయణ గ్రామము వాస్తవ్యుడు అయిన భీమాజీ పాటిల్ కు ఒకసారి ఉపిరితిత్తుల వ్యాధి సోకి, క్రమంగా అది క్షయగా పరిణమించింది. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజులలో క్షయవ్యాధిని మృత్యు ద్వారంగా పరిగణించేవారు. స్వతాహాగా ధనవంతుడైన భీమాజీ ఎన్నో రకాల మందులను వాడాడు, ఎందరో ప్రసిద్ధమైన దాక్టర్లకు చూపించాడు కాని ఆ వ్యాది ఇసుమంతైనా తగ్గలేదు. ఇక ప్రాణం మీద ఆశ వదులుకొని " ఓ భగవంతుడా నీవే నాకిక దిక్కు" అని రాత్రింబవళ్ళూ అతి దీనంగా ప్రార్ధించసాగాడు. అతని ప్రార్ధనలు ఆ సాయికి చేరాయా అన్నట్లుగా ఆ తర్వాత భీమాజి తన అనారోగ్యం వివరాలను సాయి భక్త శిఖామణి నానా చందోర్కర్ కు రాసాడు. అందుకు నానా " అన్ని వ్యాధులకు ఏకైక నివారణ సర్వస్య శరణాగతి చేసి సాయి పాదాలపై పడుటయే" అని సమాధానమిచ్చాడు. అప్పుడు భీమాజీ నానా సలహాపై అధారపడి తన బంధువుల సహాయంతో శిరిడీకి వచ్చి మసీదు లో బాబా కాళ్ళపై పడి తన వ్యాధి తగ్గించమని ప్రాధేయపడ్డాడు. ఈ వ్యాధి అతని గత జన్మల ప్రారబ్ధ ఫలితమని, ఆ పాపములను అనుభవించి వాటి నుండి విముక్తి అవ్వడమే సరైన మార్గమని, అందువలన ఈ విషయంలో తాను కలుగజేసుకొనడం లేదని బా...

విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం

Image
  విశాఖపట్నం నగరంలో ఉన్న ఒక ఆనందకరమైన అందమైన ఆలయం, శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం బలమైన చారిత్రక నేపథ్యం ప్రాముఖ్యతతో సమరూపతతో కూడిన నిర్మాణంతో ప్రగల్భాలు పలుకుతుంది. హిందూ సమాజానికి అంకితం చేయబడిన ఈ ఆలయం శ్రీ కనక మహాలక్ష్మి భక్తులకు దివ్యమైన, విశ్రాంతి మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది మరియు హిందూ సమాజానికి నిస్సందేహంగా సందర్శించదగిన ప్రదేశం. శ్రీ లక్ష్మి అవతారమైన ప్రతిష్ఠాపన విగ్రహం అప్పట్లో ఈ ప్రాంత పాలకుల కులదైవం అని, వారు ఆమెను అమ్మవారిగా ఆరాధించేవారు. పూర్వం ఓ పండితుడు కాశీకి చేరుకుని చివరివరకు అక్కడే గడిపి శివసాయుజ్యం పొందాలని బయలుదేరాడు మార్గమధ్యంలో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ బావి వద్ద స్నానం ఆచరించాడు బావిలోపల నుంచి ఏదో శబ్దం వినిపించడంతో పండితుడు బావిలో నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని వెలుపలకు తీసి ప్రతిష్టించి పూజలు చేసినట్లు కథనం.విశాఖపట్నంలోని బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది ఆలయం చుట్టూ గోడ ఉంది కానీ పైకప్పు లేదు వానకు తడుస్తూ ఆరు బయట అమ్మ కొలువుతీరి ఉంది నడుము పైభాగం వరకు మాత్రమే అంటే చాతి వరకు మాత్రమే అమ్మవారి మూర్తి ఉంటు...

పంచమ వేదం

Image
మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసం, ఇక్కడ ప్రధాన కథ రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది - పాండవులు మరియు కౌరవులు - కురుక్షేత్ర యుద్ధంలో, హస్తినాపుర సింహాసనం కోసం యుద్ధం చేస్తారు. మహా భారతం సంస్కృతంలో వేద వ్యాసుడు వ్రాసిన మహా కావ్యం. భారతీయ సాహిత్యం లోనూ, సంస్కృతిలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేద వ్యాసుడు వ్రాసిన ఈ ఉద్గ్రంధాన్ని ముగ్గురు మహాకవులు తెలుగులో కావ్యంగా వ్రాశారు. దానిని శ్రీ మదాంధ్ర మహాభారతం అని అంటారు. ఒక సాంప్రదాయం ప్రకారం వేదవ్యాస మహర్షి   పద్యాలను నిర్దేశిస్తుండగా గణేశుడు వాటిని వ్రాసినట్లు చెప్పబడింది. 100,000 శ్లోకాల వద్ద, ఇది ఇప్పటివరకు వ్రాసిన పొడవైన పురాణ కవిత అని అంతారు. ఇది క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో లేదా అంతకుముందు వ్రాయబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ‘మహాభారతాన్ని’ మాత్రమే పంచమవేదమని పిలుస్తారు. ‘భగవద్గీత’ మహాభారతంలో ఉన్నందువల్లనే ఈ ఇతిహాసానికి ఆ పేరు వచ్చింది. వేదాలకు అద్యుడైన వ్యాసమహర్షి తన శిష్యులద్వారా ప్రచారం గావించాడు. కనుక వేదవ్యాసుడయ్యాడు. ఆ వేదవ్యాస మహర్షి చేత ప్రణీతమైనందున మహాభారతమే పంచమ వేదమనీ పిలువబడింది. నిజానికి వేదాలు నాలుగే మరియు అవి మానవ ని...

బీహార్‌లోని చండికా దేవి ఆలయం

Image
  బీహార్‌లోని చండికా దేవి ఆలయం (సి.హెచ్.ప్రతాప్) బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఉన్న చండికా దేవి ఆలయం భారతదేశంలోని ప్రధాన శక్తిపీఠాలలో ఒకటి. సతీ దేవి ఎడమ కన్ను ఇక్కడ పడిందని ప్రతీతి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ ఆలయ చరిత్ర మహాభారత కాలానికి సంబంధించినది అని తెలుస్తోంది.ఇక్కడే దాన కర్ణుడు ప్రతిరోజు పావు వంతు బంగారాన్ని దానం చేసేవాడని చండికా దేవి ఆలయం గురించి ఒక నమ్మకం.ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటే కంటి జబ్బులతో బాధపడేవారి రోగాలు నయమవుతాయని నమ్ముతారు. అందుకే కంటి జబ్బులతో బాధపడేవారు ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి పూజలు చేస్తారు. ఈ ఆలయం దుర్గాదేవి భయంకరమైన, శక్తివంతమైన రూపమైన చండికా దేవి ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. గౌహతి సమీపంలోని కామాక్ష దేవాలయం వలె గౌరవప్రదంగా నిర్వహించబడే ఈ పవిత్రమైన ఆలయం ఉంది. దాని ఖగోళ వాతావరణం మరియు పవిత్రమైన గాలితో, చండికా స్థాన్ భారతదేశం అంతటా భక్తులకు పవిత్ర గమ్యస్థానంగా మారింది. పురాణాల ప్రకారం చండికా స్థాన దేవాలయం శక్తి పీఠం, ఇది శక్తి యొక్క అతీంద్రియ క్షేత్రం. ఈ దివ్యమైన ప్రదేశం దక్ష యాగా యొక్క పురాణాల నుండి పుట్టిందని చెబుతారు, ఇందులో సతీదేవి తనను తాను కాల...

శ్రీరామరక్ష సర్వజగద్రక్ష

Image
రామనామం మన జీవన గమనంలో ఓ భాగం. పుట్టగానే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని దీవిస్తారు పెద్దలు. ఉగ్గుపాలతోనే రామాలాలి మేఘా శ్యామలాలి జోలపాడుతారు. శ్లో: శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే; సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే.!! రామ.. రెండక్షరాల ఈ పేరు ఎంతో మహిమాన్వితమైనది. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం నుంచి ‘రా’ అనే అక్షరాన్ని.. ఓం నమశివాయ పంచాక్షరి నుంచి ‘మ’ అనే అక్షరాన్ని కలిపితే ‘రామా’. శివకేశవతత్వం ఇమిడివున్న ఈ నామం కన్నా అమృతం ఇంకొకటి వుండదంటే అతిశయోక్తి కాదు. రామనామాన్ని మించిన రక్ష ఏదీ. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటాం. తన రక్షణ కోరి వచ్చిన విభీషణుడిని చివరిదాకా కాపాడాడు శ్రీరాముడు. తన రక్షణలో వున్న పాండవులను అడుగడుగునా అపాయాల నుంచి సంరక్షించాడు శ్రీ కృష్ణుడు. అందుకే ఆ నారాయణుడిని మనస్పూర్తిగా శరణు వేడితే శరణ్యము, ఆశ్రయము, అభయం, శత్రువుల నుండి రక్షణ కవచం  దొరుకుతాయి. శ్రీరామచంద్రుడు- పేరు వినగానే కన్నుల ఎదుట ఒక దివ్యమైన స్వరూపం సాక్షాత్కరిస్తుంది. ఆ రూపం సకల కల్యాణ గుణాలతో అలరారుతూ మనస్సులకు ఆనందాన్ని నింపుతూ మైమరపిస్తుంది. అదే శ్రీరామచంద్రునిలోని గొప్పతనం. అందరినీ ఆనందపరిచేవాడే శ్...

అన్నదానం మహా శ్రేష్టం

Image
శ్లోకం: గ‌జ తుర‌గ స‌హ్ర‌సం కోటి దానం! క‌న‌క ర‌జిత పాత్రం, మేదినీం సాగ‌రాంతాం ఉభ‌య‌కుల విశుద్ధం కోటి క‌న్యా ప్ర‌దానం! న‌హి న‌హి బ‌హు దానం అన్న‌దానం స‌మానం ఏనుగులు, గుర్ర‌ములు వేల సంఖ్య‌లో దానం చేసిన‌నూ, మంచి గోవుల‌నూ కోట్ల‌లో దానం చేసిన‌నూ, బంగారం, వెండిని లెక్క‌కు మించి దానం చేసిన‌నూ, సాగ‌ర ప‌ర్యంత‌ము గ‌ల ఈ సువిశాల ప్ర‌పంచ‌మునే దాన‌ముగా ఇచ్చిన‌నూ, కోటి క‌న్య‌ల‌ను దాన‌ముగా ఇచ్చిన‌నూ అవి అన్నియూ ఆక‌లిగొన్న వారిని కూర్చుండ బెట్టి చేయు అన్న‌దాన‌ముకు స‌మ‌మైన దాన‌ములు కావు అని అంటుంది పై శ్లోకం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి అన్నదానం ఒక పవిత్రమైన అర్పణగా భావించడం భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న ఒక గొప్ప సంస్కృతి. నేటికీ మన దేశంలో మారుమూల పల్లెల్లో కూడా అన్నదానం విసృతంగా జరుగుతోందంతే ఈ దానానికి వున్న వైశిష్ట్యం ఏమిటో తెలుస్తోంది. అన్నిటికీ మించి,  అన్నదానం చేయడంలో ఒక ఆనందం ఉంది. ఇది కేవలం ఆహారం అందించడమే కాదు. మీ భౌతిక శరీరాన్ని ‘అన్నమయ కోశం లేదా  ఆహార శరీరం అని పిలుస్తాము, ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో నిర్మించబడింది. కాబట్టి, మీరు అన్నదానం చేస్తే, వారికి శరీరాన్ని అందిస్తునట...