విశ్వజనీన ప్రేమతత్వం
కృష్ణ భగవానుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అపారమైన ప్రేమ, భక్తి, సహనం వంటి విషయాలను గురించి భగవద్గీతలో కృష్ణుడు ప్రధానంగా వివరించాడు. ప్రేమతో జీవించడం అనేది జీవితంలో సత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అనుభవాలను,శాంతిని ఆనందాన్ని నేర్పుతుందని ఆయన తెలిపారు.ప్రేమకు సహనం అనేది ముఖ్యం.నిజమైన ప్రేమ అనేది ఎటువంటి అంచనాలు లేకుండా, ఎటువంటి కారణాలు లేకుండా, ప్రయోజనం కోరకుండా ఉండాలని కృష్ణుడు తెలిపాడు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి స్వార్థం, ఆశ లేకుండా ఉండటం, వారి మనోభావాలను గౌరవం ఇవ్వడం బంధాల్లో ప్రేమను పెంచేందుకు సహాయడతాయి. ఒకరి పట్ల మరొకరు జాగ్రత్తగా వ్యవహరించడమే నిజమైన ప్రేమ అని మన సనాతన ధర్మం చెబుతోంది.పరమాత్మను మీ సొంతం చేసుకోవాలంటే, కేవలం ప్రేమతోనే అది సాధ్యం. ప్రేమతో ఉంటే నేను సంతోషంగా మీ పరం అవుతాను. ప్రేమ అనేది జీవన శక్తి, ఇది ప్రపంచాన్ని నడిపించే శక్తి.నిజమైన హితుడు, స్నేహితుడు భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని చెప్పే దే కుచేలుని చరిత్ర. ప్రకృతి పురుషుల కలయికను తెలిపే తత్త్వబోధనే రుక్మి ణీ కళ్యాణం. రుక్మిణి జీవాత్మ. శ్రీకృష్ణుడు పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ను చేరాలనే తపనే రుక్మిణీ కళ్యాణం.మనిషి పక్షిలా ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడు. చేపలా నీటిలో ఈదడం నేర్చుకున్నాడు కానీ ఈభూమి మీద మనిషిలా బ్రతకటం మనిషికి చేతకాకవటం లేదు. నాగరికత పెరిగింది. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందింది. కాని ప్రేమతత్వం అంతగా పెంపొందడం లేదు.
ప్రేమ అనగా ఎవరినీ ద్వేషించకపోవటం. ప్రేమ అందరినీ ఏకం చేస్తుంది. ఏకాత్మ దర్శనమే ప్రేమతత్వము.
Comments
Post a Comment