పంచమ వేదం




మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసం, ఇక్కడ ప్రధాన కథ రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది - పాండవులు మరియు కౌరవులు - కురుక్షేత్ర యుద్ధంలో, హస్తినాపుర సింహాసనం కోసం యుద్ధం చేస్తారు. మహా భారతం సంస్కృతంలో వేద వ్యాసుడు వ్రాసిన మహా కావ్యం. భారతీయ సాహిత్యం లోనూ, సంస్కృతిలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేద వ్యాసుడు వ్రాసిన ఈ ఉద్గ్రంధాన్ని ముగ్గురు మహాకవులు తెలుగులో కావ్యంగా వ్రాశారు. దానిని శ్రీ మదాంధ్ర మహాభారతం అని అంటారు. ఒక సాంప్రదాయం ప్రకారం వేదవ్యాస మహర్షి   పద్యాలను నిర్దేశిస్తుండగా గణేశుడు వాటిని వ్రాసినట్లు చెప్పబడింది. 100,000 శ్లోకాల వద్ద, ఇది ఇప్పటివరకు వ్రాసిన పొడవైన పురాణ కవిత అని అంతారు. ఇది క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో లేదా అంతకుముందు వ్రాయబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ‘మహాభారతాన్ని’ మాత్రమే పంచమవేదమని పిలుస్తారు. ‘భగవద్గీత’ మహాభారతంలో ఉన్నందువల్లనే ఈ ఇతిహాసానికి ఆ పేరు వచ్చింది. వేదాలకు అద్యుడైన వ్యాసమహర్షి తన శిష్యులద్వారా ప్రచారం గావించాడు. కనుక వేదవ్యాసుడయ్యాడు. ఆ వేదవ్యాస మహర్షి చేత ప్రణీతమైనందున మహాభారతమే పంచమ వేదమనీ పిలువబడింది. నిజానికి వేదాలు నాలుగే మరియు అవి మానవ నిర్మితాలు కావు. అపౌరుషేయాలు. అంటే, ఈశ్వరీయాలు. అయిదవ వేదంగా మహాభారతాన్ని మాత్రమే పిలిచే సాంప్రదాయం మనకు వుంది. కురుపాండవుల కథో, 18 రోజుల యుద్ధ విశేషాల సమాహారమో మాత్రమే కాదు. దీనిలో నీతి, ధర్మం, పరిపాలన విధానం, మానవ సంబంధాలు, కుటుంబ విలువలు… ఇంకా ఎన్నో ఆదర్శప్రాయమైన అంశాలు ఉన్నాయి. ‘ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు’ అన్న వేదవ్యాస మహర్షి వాక్కులు అక్షర సత్యాలు.మహా భారతం 18 పర్వములతో, లక్ష శ్లోకాలతో ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా పేరు గాంచింది. మన ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు మహాభారతాన్ని చదువుకుంటూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా ఇది చదవడం చాలా ముఖ్యం. ఇది కేవలం గ్రంథం మాత్రమే కాదు. ఒక మనిషి ఎలా జీవించాలి అనేది తెలియజేస్తుంది. జ్ఞానాన్ని బోధిస్తుంది. సత్య మార్గాన్వేషణ ఎలా చేయాలో వివరిస్తుంది. ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని అందులోని వ్యత్యాసాన్ని చెప్తుంది. మహా భారతం చదవడం వల్ల మనకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. 

Comments

Popular posts from this blog

భక్తులను సదా రక్షించే శ్రీ సాయి

విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం

కర్మ సిద్ధాంతం