మానవత్వం- మానవతా విలువలు
మానవత్వం
సాటి మానవుడికి తన శక్తి కొలది ఎంతో కొంత మేలు చేయడం అన్నది మనిషి నానాటికి మరిచిపోతున్న రోజులివి. మానవీయ విలువలను ఏమాత్రం పట్టించుకోని సమాజం తయారవుతోంది అన్నది వాస్తవం. నాగరికత వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాం.. సాశ్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయమైన ప్రగతి సాధించాం అని చెప్పుకుంటున్న మనిషి... మనిషిగా ఉండటం మాత్రం మరిచిపోతున్నాడని సామాజిక శాస్త్రవేత్తలు, విశ్లేషకులు పేర్కొంటు న్నారు. మాజం అభివృద్ధి చెందాలంటే నైతిక, నాగరిక, దాతృత్వ, మానవీయ విలువలు అత్యంత ముఖ్యం. నేటి విద్యా విధానంలో సైన్సు, లెక్కలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వీటిని విస్మరంచడం ఎంతమాత్రం మంచిది కాదు.
మానవత్వం వుంటే నైతిక విలువలు వాటంతట అవే వస్తాయి. కాబట్టి కావాల్సింది మానవత్వం. మానవత్వం వుంటే నైతిక విలువలు గురించి విడిగా ఆలోచించనక్కరలేదు. డు ఎక్కువమంది నైతిక విలువలు వున్నట్లు నటిస్తున్నారు. వారిలో మానవత్వం మచ్చుకైనా కవిపించదు. మనుషుల్లో మానవత్వం పెరిగితే లోకం ఆనందంగా శాంతి సౌభాగ్యాలతో వర్ద్ధిల్లుతుంది.
శ్రీ సత్యసాయిబాబా ఒక సందర్భంలో మానవత్వం గురించి అధ్హ్భుతమైన దివ్యోపదెసం చేసారు. "మానవుడు ధనమును కోల్పోయిన ఎదో ఒక విధమైన శ్రమ పడి ధనమును సాధించగలడు. ఆరోగ్యమే కోల్పోయిన అతిశక్తివంతమైన డాక్టర్ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడను మనము చేకూర్చుకొనవచ్చు. కానీ మానవుడు విలువను కోల్పోయిన ఇంక మానవత్వమే నిలువదు. ఈనాటి మానవతా విలువలు అత్యవసరమైనటువంటివి. మానవునితోనే ఆవిర్భవించినటువంటివి ఈ మానవతా విలువలు. మానవతా గుణములు ఎక్కడో గ్రంధమునుంచి కానీ, గురువులనుఒచి కానీ, బోదించబడి సాధించేటటువంటివి కాదు. మన నిత్య జీవితము లోపల సత్య మైనటువంటి కర్మలు ఆచరించి, సత్యమైన భావములను మనము అభివృద్ధి పరచుకున్నప్పుడు, ఈ మానవతా విలువలు మన జంటనే వెంటనే ఇంటనే ఉండి మనలను కాపాడుతూ ఉంటాయి."
Comments
Post a Comment