కర్మ సిద్ధాంతం

“నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్

కార్యతేహ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణైః ” — గీత 3అ.5శ్లో.

భావం:సృష్టిలోని ప్రతిప్రాణీ ఒక్క క్షణం కూడా కర్మలను
చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే
కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం.

మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేసే కర్మలే మనకు ఉపయోగపడతాయి. ఎవరికైనా అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ వారికి కూడా కలుగుతుంది. వేద భూమి కావడంతో మనం అన్యాయాలను, అక్రమాలను సహించం. అవినీతి, బంధుప్రీతిని ఉపేక్షించం. మన కర్మలే మనకు జీవితంలో ఎదిగేందుకు సాయపడతాయి. కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరికల ఉధృతిని తగ్గించుకొనుట, అనిత్యమైన భోగ భాగ్యల పట్ల ఆసక్తి తగ్గించుకొని శాశ్వతమైన పుణ్య సముపార్జన కోసం కృషి చేయడం,సాధు సత్పురుషుల దర్శనం,సజ్జన సాంగత్యం, భూత దయ పెంపొందించుకొనుట,శక్తికి మేర ధాన ధర్మములనాచరించడం,ఇత్యాది మంచి కార్యాలను చేపట్టాలి. జగత్తనే ఈ నాటక రంగం లో నటించి అలసి సొలసి పోయాను.ఇకనైనా కైవల్యం ప్రసాదించు స్వామీ అన్నదే మన నిత్య ప్రార్ధన కావాలి.నీ పాదాల చెంతనే నాకు లభించును ఆనందం. అనుక్షణం నీ పద సేవలోనే వుండి నన్ను తరించనీయవయ్యా స్వామీ ! అని ప్రార్ధిస్తూ, ఓర్పు, సహనం తో వేచి వుంటే కరుణామయుడు,దయాపూరిత హృదయుడు, అయిన ఆ స్వామి తప్పక కరుణిస్తాడు. పంజరం లో బంధించిన చిలుకను స్వేచ్చా లోకానికి వదిలిపెడితే ఏ విధమైన ఆనందం అనుభవిస్తుందో , శరీరం లో బంధించిన ఈ ఆత్మకు మోక్షం పేరిట విముక్తి లభిస్తే ఎల్లలు లేని ఆనందాన్ని అనుభవించి , ఆ భగవంతుని పాదాల చెంత వాలుతుంది. ఎవరి కర్మలకు వారే బాధ్యులంటారు. అది నిజంగా మనం ఆచరించే పనులను బట్టే ఉంటుంది. పూర్వ జన్మలో మనం చేసిన కర్మలే మనకు ఈ జన్మలో కూడా వేధిస్తాయట. అది ఎవరు చూడకున్నా చెబుతుంటారు కాబట్టి మనం నమ్ముతుండాలి. ఇలా కర్మ సిద్ధాంతాన్ని నమ్మి మనం ఎలాంటి పాపాలు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించడం మంచిది.  

Comments

Popular posts from this blog

భక్తులను సదా రక్షించే శ్రీ సాయి

విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం

కర్మ సిద్ధాంతం