గొప్ప ఫలితాలకు మనస్సే ప్రధానం




చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు

కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!

16 వ శతాబ్దంలో మన తెలుగునాట వెలసిన శ్రీ వేమన గొప్ప సంఘ సంస్కర్త. నాడే ఈ సమాజంలో నెలకొన్న దురాచారాలను , మూఢ నమ్మకాలను ఖండించి, మానవుల సత్ప్రవర్తన ఎలా వుండాలో తన పద్యాల ద్వారా సులభశైలిలో వివరించి ఈ మానవాళికి మహోపకారం చేసారు. పై పద్యానికి అర్ధం మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నది కదా అని.. ఈ కలియుగంలో మానవులు కలి ప్రభావానికి లోనై ఘోరమైన పాపాలు చేస్తుంటారని కలియుగం ఆరంభం ముందే బ్రహ్మదేవుడు హెచ్చరించాడు. అందులో ముఖ్యమైనది మానవుల మనసు వేగంగా పరిగెత్తే గుర్రాలలా వారి ఆధీనంలో నియంత్రణలో వుండ దని. అందుకే మనస్సును జయించడం, దానిని ఆధీనం లోకి తెచ్చుకోవడం ఎంతో అవసరం.

ఈ పద్యం ద్వారా మనసు యొక్క ప్రాముఖ్యాన్ని వేమన తెలియజేసారు. దానధర్మాలు చేయడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, అతిథి అభ్యాగతులు ఆదరించడం,పేదసాదలకు సహాయం చెయ్యడం చివరకు ఇంట్లో వ్రతాలు, పూజాది సంస్కారాల సమయంలో మనసును పవిత్రం చేసుకోవడం, నిజమైన ప్రేమ, దయ కరుణ లాంటి మంచి గుణాలతో చేస్తే , ఆ కార్యం ఎంత చిన్నదైనా పెద్ద ఫలితాలను ఇస్తుందని వేమన భావం.

మంచి మనసు, చిత్తశుద్ధితో ఎంత పెద్ద కార్యాలు చేసిన అవి సత్ఫలితాలను ఇవ్వవు అని వేమన తెగేసి చెప్పారు. ఇందుకు ఉదాహరణ పెద్ద మర్రిచెట్టు కూడా చిన్న విత్తనం నుండే పెరుగుతుంది. అట్లే గొప్ప ఫలితాలను ఇచ్చే చిన్న చిన్న సత్కార్యాలు కూడా మంచి మనసు ద్వారానే సిద్ధిస్తాయి. మనమందరం ఈ విషయాన్ని శ్రద్ధగా అర్ధం చేసుకొని , మనసులో నిక్షిప్తం చేసుకొని ఆచరిస్తే మహోన్నతులౌతాం.

Comments

Popular posts from this blog

భక్తులను సదా రక్షించే శ్రీ సాయి

విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం

కర్మ సిద్ధాంతం