రుద్రాక్షల ప్రాశస్థ్యం


 రుద్రాక్షల ప్రాశస్థ్యం

రుద్రాక్ష అంటే రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల (కన్నుల) నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు.

శివ పురాణము ప్రకారము రుద్రాక్ష పరమశివునికి ప్రీతికరమైనది. అందువల్ల హిందువులు మరీ ముఖ్యముగా శైవ సాంప్రదాయాన్ని పాటించేవారికి రుద్రాక్ష పరమ పవిత్రమైనది. రుద్రాక్ష ధారణ వల్ల పాపాలు తొలగి, ధరించినవారు శివునికి ప్రీతి పాత్రులవుతారని హిందువుల నమ్మకము. రుద్రాక్షను ధరించి భక్తితో ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రము జపిస్తే సకల శుభాలు కలుగుతాయని శివపురాణములో పేర్కొనబడింది. రుద్రాక్షను ధరించినవారు మద్యమాంసములను ముట్టకూడదు, మరే యితర అనైతిక కార్యక్రమాలలో పాల్గొనకూడదు.రుద్రాక్షలు వైద్య పరముగా కూడా ముఖ్యమైనవి ఆయుర్వేద వైద్యములో వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యముగా అధిక రక్త పీడనాన్ని రుద్రాక్ష అదుపు చేస్తుందని చాలా మంది నమ్మకము. సహజంగా ఈ రుద్రాక్షలన్నింటినీ కూర్చి ఒక దండలాగా చేస్తారు సాంప్రదాయకంగా ఒక రుద్రాక్ష మాలలో 108 పూసలు కంటే ఒకటి ఎక్కువగా ఉండాలని భావిస్తారు. ఆ ఒకటి ఎక్కువ ఉన్న రుద్రాక్షయే బిందువు. ప్రతి రుద్రాక్ష మాలకి ఖచ్చితంగా బిందువు ఉండాలి లేని పక్షంలో ఆ శక్తి చక్రంలా తయారవుతుంది. రుద్రాక్షలు ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు కలిగి ఉంటాయి. అవి మీ శక్తినే ఒక కవచంలాగా తయారుచేసి, వేరే శక్తులు మిమ్మల్ని కలత పెట్టకుండా చేస్తాయి. అందుకే రుద్రాక్షలు ఎప్పుడూ ఒకే చోట కాకుండా తిరుగుతూ, వేరు వేరు చోట్ల తినే వారికి చాలా ఉపయోగకరం.ఏ ముఖ రుద్రాక్షలు ధరించిన వారైనా సరే తప్పని సరిగా నియమ, నిబంధనలు పాటించవలయును, రుద్రాక్షలు ధరించి మధు, మాంసాహారం తీసుకో కూడదు. శుచి శుభ్రతలు పాటించాలి. ఇంద్రియనిగ్రహశక్తి ముఖ్య అవసరం. నిష్టాగా ఉండాలి.రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి.

రుద్రాక్షలు పర్వతాల మీద, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలలో కొంత ఎత్తులో పెరిగే ఒక వృక్షజాతి చెట్టు గింజలు. అవి ఇంకా అనేక ఇతర ప్రాంతాలలో, పశ్చిమ కనుమలలో కూడా పెరుగుతాయి. కానీ నాణ్యత కలవి ఎత్తైన హిమాలయ ప్రాంతం లోనే లభిస్తాయి.ప్రకృతిలో వివిధ రకాలుగా నీరు విషపూరితమయ్యే అవకాశముంది. కాబట్టి అరణ్యాల్లో నివసించే సాధువులు, సన్యాసులు అన్ని చోట్ల మంచినీరు తాగలేరు. అలా తాగితే ఆ నీరు వారిని దుర్బలం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుంది. ఆ నీటి మీద రుద్రాక్షమాలను పట్టుకుంటే, మాల సవ్య దిశలో తిరిగితే ఆ నీరు తాగవచ్చు. అదే విషపూరితమైన నీరైతే రుద్రాక్షమాల అపసవ్య దిశలో తిరుగుతుంది.రుద్రాక్షకు ఒకటి నుంచి ఇరవై ఒకటి దాకా ముఖాలు ఉండవచ్చు. అవి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే రుద్రాక్షను దుకాణంలో కొని వేసుకోకూడదు. కాని పంచముఖి రుద్రాక్ష ఆడ, మగ, పిల్లలు అందరికీ మంచిదే. అది సౌఖ్యానికి, ఆరోగ్యానికి, స్వతంత్రతకూ సర్వత్రాదోహదకారి.

రుద్రాక్ష రక్తపోటుని కూడా తగ్గిస్తుంది. మీ నరాలకు కొంత నెమ్మదిని కలిగించి మీ నాడీ వ్యవస్థకు కొంత స్వాంతన, చురుకుదనాన్ని కలిగిస్తుంది. మీరు మీ జీవితాన్ని పవిత్రం చేసుకుందామనుకుంటే, రుద్రాక్ష మంచి ఉపకరణం.
రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి.  1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. 2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. 3. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. 4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు 5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.

Comments

Popular posts from this blog

కర్మ సిద్ధాంతం

భక్తులను సదా రక్షించే శ్రీ సాయి

విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం