Posts

Showing posts from March, 2025

ఉత్తమ సాధకులు

  సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడిన నా ఈ రచనను ఈ దిగువ ఇవ్వంబడిన లింక్ ద్వారా చదివి తమ అమూల్యమైన అభిప్రాయం తెలుపగలరు.  https://sanchika.com/uttama-saadhakulu-chp/

రుద్రాక్షల ప్రాశస్థ్యం

Image
  రుద్రాక్షల ప్రాశస్థ్యం రుద్రాక్ష అంటే రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల (కన్నుల) నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. శివ పురాణము ప్రకారము రుద్రాక్ష పరమశివునికి ప్రీతికరమైనది. అందువల్ల హిందువులు మరీ ముఖ్యముగా శైవ సాంప్రదాయాన్ని పాటించేవారికి రుద్రాక్ష పరమ పవిత్రమైనది. రుద్రాక్ష ధారణ వల్ల పాపాలు తొలగి, ధరించినవారు శివునికి ప్రీతి పాత్రులవుతారని హిందువుల నమ్మకము. రుద్రాక్షను ధరించి భక్తితో ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రము జపిస్తే సకల శుభాలు కలుగుతాయని శివపురాణములో పేర్కొనబడింది. రుద్రాక్షను ధరించినవారు మద్యమాంసములను ముట్టకూడదు, మరే యితర అనైతిక కార్యక్రమాలలో పాల్గొనకూడదు.రుద్రాక్షలు వైద్య పరముగా కూడా ముఖ్యమైనవి ఆయుర్వేద వైద్యములో వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యముగా అధిక రక్త పీడనాన్ని రుద్రాక్ష అదుపు చేస్తుందని చాలా మంది నమ్మకము. సహజంగా ఈ రుద్రాక్షలన్నింటినీ కూర్చి ఒక దండలాగా చేస్తారు సాంప్రదాయకంగా ఒక రుద్రాక్ష మాలలో 108 పూస...