కామాఖ్యా దేవి

భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో అత్యంత ప్రాచీనమైనది, పవిత్రమైనది అస్సాంలోని నీలాచల్ పర్వతంపై వెలసిన కామాఖ్యా దేవి ఆలయం. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్యా దేవి, కామరూపిణి అని పిలుస్తారు. "కామం" అనగా సాధారణంగా శారీరక ఆకర్షణ లేదా చిత్తచాంచల్యం అని అర్థం. కానీ ఇక్కడ "కామ" అనగా సంకల్పం, మార్పు శక్తిగా భావించబడుతుంది. అనుకున్న రూపాన్ని, అనుకున్న క్షణంలో మార్చుకోగల శక్తి కలిగినవారే కామరూపిణులు . అలాంటి శక్తిమంతురాలు కావడంతోనే ఆమెను కామరూపిణీ అంటారు. కామాఖ్యా దేవి అనేక రూపాల్లో భక్తులకు ప్రత్యక్షమై, వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. ఆమెను త్రిపుర శక్తిదాయినిగా కొలుస్తారు, ఎందుకంటే ఈ క్షేత్రంలో ఆమె మూడు ప్రధాన రూపాల్లో దర్శనమిస్తుంది. తంత్ర, శక్తి, భక్తి పరంగా ఇది అత్యంత శక్తివంతమైన పీఠంగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. ఆలయంలో విగ్రహం లేకుండా, యోనిపీఠాన్ని మాత్రమే పూజిస్తారు. ఇది శక్తిస్వరూపాన్ని సూచిస్తుంది. ఈ క్షేత్రంలో జరిగే అంబుబాచీ మేళాకు విశేష ప్రాధాన్యం ఉంది. మానవ స్త్రీల మాదిరిగానే కామా...