కర్మ సిద్ధాంతం
కర్మ సిద్ధాంతం (సి.హెచ్.ప్రతాప్ ) “నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతేహ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణైః ” — గీత 3అ.5శ్లో. భావం:సృష్టిలోని ప్రతిప్రాణీ ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మనం చేసే కర్మలే మనకు ఉపయోగపడతాయి. ఎవరికైనా అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ వారికి కూడా కలుగుతుంది. వేద భూమి కావడంతో మనం అన్యాయాలను, అక్రమాలను సహించం. అవినీతి, బంధుప్రీతిని ఉపేక్షించం. మన కర్మలే మనకు జీవితంలో ఎదిగేందుకు సాయపడతాయి. కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరి...